ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI Ramakrishna: వివేకా కేసులో అందరూ నాటకాలాడుతున్నారు: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ న్యూస్

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ సహా అందరూ నాటకాలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. వివేకా కేసులో ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా మంత్రి కొడాలి నాని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. అది తగదని హితవు పలికారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

By

Published : Feb 27, 2022, 3:19 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విషయమై ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పలేక.. మంత్రి కొడాలి నాని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వివేకా కేసులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. వ్యక్తిగత విమర్శలు చేయటం సరికాదన్నారు. వివేకా కేసులో సీబీఐ సహా అందరూ నాటకాలాడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో చిన్న పిల్లాడిని అడిగినా హత్య కేసు నిందితులెవరో చెబుతారని దుయ్యబట్టారు.

వారికి అండగా ఉంటాం..
పీఆర్సీ విషయంలో వైకాపా ప్రభుత్వం అప్రదిష్టపాలవ్వటమే కాకుండా.. ఉద్యోగ సంఘాల నాయకులతో పీఆర్సీని అంగీకరింపజేసి వారిని కూడా ఉద్యోగుల్లో అప్రదిష్టపాల్జేశారని రామకృష్ణ ఆక్షేపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమాలకు వామపక్ష పార్టీలుగా అండగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో అనంతపురంలో జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న ఉద్యమాలపై పలు తీర్మానాలు చేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details