CPI Ramakrishna on MP Viajaysai Reddy: రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అధికారం లేదనే విషయాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా ? లేక గత మూడేళ్లు నిద్రపోయారా ? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మూడేళ్ల తర్వాత మూడు రాజధానుల విషయంలో రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని రాజ్యాంగ సవరణ కోరుతూ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు దాఖలు చేయడమేంటని నిలదీశారు.
'విజయసాయి గారూ.. ఆ విషయాన్ని ఇప్పటికి గుర్తించారా ?'
CPI state secretary Ramakrishna: వైకాపా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించిందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను నిర్వీర్యం చేయదలచిందన్నారు. రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అధికారం లేదనే విషయాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా ? లేక గత మూడేళ్లు నిద్రపోయారా ? అని ఆయన ప్రశ్నించారు.
సీపీఐ రామకృష్ణ
వైకాపా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించిందని రామకృష్ణ మండిపడ్డారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయదలచిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి