కేవలం 3 వేలమందే కరోనాతో మరణించారని ప్రభుత్వం చెబుతోందని.. సీపీఐ రామకృష్ణ అన్నారు. ఏటా మేలో జరిగే సాధారణ మరణాల కంటే 400 శాతం అధికంగా ఉందన్నారు. కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
గత నెలలో రాష్ట్రంలోని మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ - కరోనా మరణాలపై సీపీఐ రామకృష్ణ కామెంట్స్
మే నెలలోనే 1.30 లక్షల మరణాలు సంభవించాయని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. మే నెలకు సంబంధించి ఏపీలో జరిగిన మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

cpi ramakrishna on corona deaths