రాష్ట్రానికి గుండెకాయ లాంటి బెజవాడలో వైకాపా ఆటలు సాగనివ్వొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపాను ఓడించకుంటే అమరావతి రాజధానిగా ఉండదన్నారు. పసుపు-ఎరుపు కలయిక శుభసూచికమన్నారు. అన్ని స్థానాల్లో తెదేపా-సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
అక్కడ పోలింగ్ లేకుండా ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు: రామకృష్ణ - విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు న్యూస్
పులివెందుల, పుంగనూరులో పోలింగ్ లేకుండా ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వైకాపా గెలిస్తే పులివెందుల రాజ్యమే విజయవాడలోనూ వస్తుందని మండిపడ్డారు.
cpi ramakrishna comments on cm jagan