ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా తీరు దివాళాకోరుతనానికి నిదర్శనం: రామకృష్ణ - కొవిడ్ కట్టడిపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలు

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ పాలనవల్లే కరోనా కట్టడి సాధ్యమైందని గతంలో చెప్పుకున్న భాజపా నేతలు.. రెండో వేవ్​ వచ్చేనాటికి రాష్ట్రాలు విఫలమయ్యాయని ఆరోపించడం సరికాదన్నారు. త్వరగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు.

cpi state secretary ramakrishna
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : May 23, 2021, 3:47 PM IST

కరోనా కట్టడిలో రాష్ట్రాలు విఫలమయ్యాయని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుపట్టారు. మోదీ నాయకత్వంలోనే కరోనా కట్టడి సాధ్యమైందని గతంలో తీర్మానం చేసిన భాజపా.. ఇప్పుడు రెండో దశ కరోనా కట్టడిలో రాష్ట్రాలు విఫలమయ్యాయని మాట్లాడుతోందని విమర్శించారు. ఇది ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చి వైరస్​ను తుదముట్టించడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు.

రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రజలు ఆనందయ్య మందు కోసం ఆసుపత్రులు ఖాళీ చేసి మరీ బారులు తీరారని రామకృష్ణ అన్నారు. ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో.. 13 జిల్లాల్లోని కరోనా బాధితులను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details