దేశంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకున్నారని సీపీఐ రామకృష్ణ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. పంట చేతికి వచ్చి అమ్ముకునే మార్గం లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని.. మన రాష్ట్రంలో గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆర్థిక సాయం చేయాలని రామకృష్ణ కోరారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: రామకృష్ణ
రాజకీయాలు పక్కనబెట్టి కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అన్ని రాజకీయ పార్టీల సూచనలు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: రామకృష్ణ