'కరోనా భయం కంటే కరెంట్ బిల్లుల భయం పట్టుకుంది'
రాష్ట్రంలోని పేదలకు కరోనా భయం కంటే కరెంట్ బిల్లుల భయం పట్టుకుందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు విమర్శించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కరెంటు బిల్లులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
'పేదలకు కరోనా భయం కంటే కరెంట్ బిల్లుల భయం పట్టుకుంది'
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కంటే వైకాపా ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న కరెంటు బిల్లులు సామాన్య, మధ్య తరగతి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు విమర్శించారు. విజయవాడ నగరంలో అత్యంత నిరుపేద ప్రాంతాలైన వాంబే కాలనీ, పాయకాపురం ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు ఒక్కసారిగా ఐదు రెట్లు నుంచి పది రెట్ల వరకూ అదనంగా రావటంపై ఆయన మండిపడ్డారు.