లాక్‌డౌన్‌ను ధ్వంసం చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ మద్యం అమ్మకాలకు సడలింపులు ఇవ్వడం వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్రం విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంపై మండిపడ్డారు. ఇస్రోలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ... ఈ నెల 9న ఛలో శ్రీహరికోట చేపట్టనున్నట్టు వెల్లడించారు.
ఇస్రో ప్రైవేటీకరణ సరికాదు.. ఉపసంహరించుకోవాలి: నారాయణ
అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఈ నెల 9 ఛలో శ్రీహరికోట కార్యక్రమం చేపట్టనున్నట్టు వివరించారు. మద్యం అమ్మకాలకు సడలింపులు ఇవ్వటం వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
cpi-national-secretary-narayana-demands-to-withdraw-isro-privatisation
తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చివేతను సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వందేళ్లపాటు మన్నిక గల పటిష్ఠమైన భవనాలు కూల్చడం మూర్ఖత్వమని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి, కంపెనీ అనుమతులు రద్దు చేయాలని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాస్తే అందరూ నవ్వారు: కేటీఆర్