CPI MAHASABHA : విజయవాడలో జరుగుతున్న 24వ సీపీఐ జాతీయ మహాసభలు చివరి దశకు చేరుకున్నాయి. నేటితో మహసభలు ముగుస్తున్న నేపథ్యంలో.. ప్రధాన కార్యదర్శి ఎంపిక జరగనుంది. కేంద్ర కమిటీ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. అయితే ఈసారి పార్టీలో రెండు, మూడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారాయణ, కేరళకు చెందిన అతుల్‌కుమార్ అంజన్ పేర్లు పోటీలో వినిపిస్తున్నాయి.
నేటితో ముగియనున్న సీపీఐ జాతీయ మహాసభలు.. ప్రధాన కార్యదర్శి ఎవరో? - సురవరం సుధాకర్‌రెడ్డి
CPI NATIONAL CONGRESS MEETING : విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు నేటితో ముగియనున్న సందర్భంలో.. ప్రధాన కార్యదర్శిని కేంద్ర కమిటీ సభ్యులు ఎన్నుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారాయణ, కేరళకు చెందిన అతుల్‌కుమార్ అంజన్ పేర్లు పోటీలో బలంగా వినిపిస్తున్నాయి.

సురవరం సుధాకర్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తరుణంలో ఆయనకు ఆరోగ్య సమస్యలరీత్యా డి. రాజాను ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎంపిక చేసింది. అత్యవసర సమయంలో రాజా నియామకం జరిగిన నేపథ్యంలో ఈసారి కేంద్ర కమిటీ.. పార్టీ నేతలతో మాట్లాడి రాజాను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది. అతుల్‌కుమార్ అంజన్, నారాయణ కూడా పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. మరోవైపు ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న డి.రాజాను మరోసారి కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చాలా మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవీ చదవండి: