ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ టెస్ట్ చేస్తే జగన్ తప్ప అందరూ ఓకే అంటారు' - విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

వైకాపాలోనూ అమరావతికి అనుకూలంగా చాలామంది ఉన్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. నార్కో టెస్ట్ నిర్వహిస్తే జగన్ తప్ప వైకాపా నేతలతో సహా అందరూ దానికి అనుకూలంగా మాట్లాడతారని తెలిపారు.

cpi narayana talks about cm jagan
సీపీఐ నారాయణ

By

Published : Feb 29, 2020, 4:21 PM IST

విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నేత నారాయణ

రాష్ట్రం విడిపోయాక రాజధానిపై మొదట మాట్లాడింది తమ పార్టీయేనని సీపీఐ నేత నారాయణ అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ప్రతిపాదించింది తామేనని విజయవాడలో నిర్వహించిన రౌండ్​టేబుల్​ సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. వైకాపాలోనూ చాలామంది అమరావతికి అనుకూలమేనని.. నార్కో టెస్ట్​ నిర్వహిస్తే జగన్ తప్ప అందరూ అమరావతికి అనుకూలంగా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. జగన్‌ది ఫ్యాక్షనిస్టు ఆలోచనా ధోరణని విమర్శించారు. ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని.. వాస్తవానికి, అవాస్తవానికి జరుగుతున్న పోరాటంలో అమరావతి గెలుస్తుందని ఉద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details