మాదక ద్రవ్యాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటే దేశంలోని ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం రవాణా, విశాఖ జిల్లాలో గంజాయి తరలింపు.. అధికార వైకాపా ఆధ్వర్వంలోనే సాగుతోందని విమర్శించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు: నారాయణ - విజయవాడ తాజా వార్తలు
మాదక ద్రవ్యాలను అరికట్టే విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు ఉంటున్నారని ఆరోపించారు.
cpi narayana on drugs