ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గిటార్ పట్టిన డియర్ 'కామ్రేడ్'! - కమ్యూనిస్టులు

సీపీఐ నారాయణ.. ఎప్పుడూ... ప్రజల మధ్యే ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి. సమస్యల పరిష్కారానికి నిరసనలు.. ఆందోళనలు.. ఇదే ఆయన జీవితం. కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. కొత్త లుక్​తో ఉన్న ఆ గెటప్ ఆకట్టుకుంటోంది.

cpi narayana new look

By

Published : Oct 3, 2019, 5:37 AM IST

Updated : Oct 3, 2019, 10:03 AM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి. తన మాట తీరుతో పదునైన విమర్శలతో ఆకట్టుకునే వారు. జాతీయ కార్యదర్శిగా వెళ్లాక ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అప్పుడప్పుడు మాత్రమే మెరుస్తున్నారు. అయితే... రెండు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆయన ఫోటో ఒకటి బాగా ఆకట్టుకుంటోంది. మెడలో గిటార్ వేసుకొని రాక్ స్టార్ లా కనిపిస్తున్న నారాయణ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల కిందట ఫేస్​బుక్​లో ఈ ఫొటో పోస్ట్ చేశారు. నారాయణగారి లో ఎన్ని కళలు ఉన్నాయో అంటూ పార్టీ నేతలు, సన్నిహితులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Last Updated : Oct 3, 2019, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details