ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్ఈసీ కేసు: సుప్రీం తీర్పుపై సీపీఐ నారాయణ హర్షం - ఎస్ఈసీ రమేశ్ కుమార్ కేసు వ్యవహారం

ఎస్ఈసీ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హర్షం వ్యక్తం చేశారు.

Cpi Narayana comments sec case
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

By

Published : Jun 10, 2020, 3:14 PM IST

Updated : Jun 10, 2020, 4:17 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హర్షం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా ఆర్డినెన్సు తీసుకొచ్చి రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను తొలగించడం తీవ్ర తప్పిదమని అన్నారు. మేధావులు మొదలు కోర్టుల వరకు ఇదే విషయాన్ని అంతా చెబుతున్నా... ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఖరి తెలుగు ప్రజానీకానికి అవమానకరమని... ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి, ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ఉండాలన్నారు నారాయణ.

సరైన రాజకీయ విధానాలుంటేనే గెలుస్తారు..

కేవలం సంక్షేమ పథకాలే ఎన్నికలలో పార్టీలను గెలిపించవని... సరైన రాజకీయ విధానాలు ఉంటేనే గెలుపు సాధ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాజధాని అమరావతి, ప్రత్యేక హోదా అంశాలను ఎవరైతే రాజకీయ విధానాలుగా తీసుకుంటారో ఆ పార్టీనే గెలుస్తుందన్నారు. గవర్నర్ పదవి అనేది రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని నారాయణ దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:ఎస్​ఈసీ వ్యవహారం: మెుదటి నుంచి.. అసలేం జరిగింది..?

Last Updated : Jun 10, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details