నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్ఈసీగా పునర్నియమించటంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. "ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం రమేశ్ కుమార్‌ది. ఆయన వివిధ హోదాల్లో పనిచేసినా నిరాడంబరంగా విధులు నిర్వర్తించారు. అంతా మన మంచికే అన్న వ్యాఖ్య రమేశ్ కుమార్‌కు సరిగ్గా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ పుణ్యమా అని ఆయన జాతీయ స్థాయిలో ఎదిగిపోయారు. ఈ విషయంలో రమేశ్ కుమార్ స్వయంగా వెళ్లి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తే మంచిదని నా అభిప్రాయం" అని నారాయణ వ్యాఖ్యానించారు.
జగన్‌కు నిమ్మగడ్డ కృతజ్ఞతలు తెలియజేయాలి: సీపీఐ నారాయణ - సీపీఐ నారాయణ తాజా వార్తలు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆయన జాతీయ స్థాయిలో ఎదిగిపోయారన్నారు.
![జగన్‌కు నిమ్మగడ్డ కృతజ్ఞతలు తెలియజేయాలి: సీపీఐ నారాయణ నిమ్మగడ్డ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి: సీపీఐ నారాయణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8243125-879-8243125-1596184471050.jpg)
నిమ్మగడ్డ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి: సీపీఐ నారాయణ