ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని వెళ్లొద్దు: నారాయణ - అయోధ్యలో రామాలయ నిర్మాణం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో అలాంటి చర్యలు తీసుకొవద్దని అన్నారు.

cpi-narayana-comments-on-pm-modi-not-going-to-lay-foundation-stone-for-ayodhya-ramalayam
cpi-narayana-comments-on-pm-modi-not-going-to-lay-foundation-stone-for-ayodhya-ramalayam

By

Published : Jul 20, 2020, 5:32 PM IST

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేయడమంటే రాజ్యాంగ ఉల్లంఘనే అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రధాని ఇలాంటి చర్యలకు పోతే అరాచకాలు మొదలవుతాయని తెలిపారు.

మొన్నటి వరకు జరిగిన బాబ్రీ మసీదు గొడవలకు పరిష్కారం కనుగొన్నాం. మోదీ వెళ్తే అలా జరిగితే మళ్లీ నిరసనలు కొనసాగే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదని నారాయణ డిమాండ్ చేశారు. ఒకవేళ శంకుస్థాపనకు వెళితే రాజ్యాంగ వ్యతిరేక ప్రధానిగా మిగిలి పోతారని హెచ్చరించారు.

రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు ప్రధాని వెళ్లొద్దు: నారాయణ

ఇదీ చూడండి :రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్

ABOUT THE AUTHOR

...view details