మరోసారి మంత్రివర్గాన్ని డమ్మీ చేసి పాలనంతా ముఖ్యమంత్రి జగన్, సజ్జలే చేయనున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విద్యుత్ కోతలు, పెట్రోధరలు, నిత్యావసర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో రామకృష్ణ, ఇతర సీపీఐ నేతలు పాల్గొన్నారు. లాంతర్లు పట్టుకొని ఎడ్ల బండిపై నిరసన తెలిపారు. నేటి నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు. ఈనెల 15న ప్రజా సంఘాలతో కలసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని రామకృష్ణ తెలిపారు.
అది డమ్మీ మంత్రివర్గం.. పాలనంతా వారి చేతుల్లోనే: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ తాజా వార్తలు
జగన్ మంత్రివర్గ కూర్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. మరోసారి డమ్మీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారన్న ఆయన.. పాలనంతా సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలే చేయనున్నారని ఆరోపించారు.

పాలనంతా వారి చేతుల్లోనే