పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో వినూత్న నిరసన చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, నిత్యావసర వస్తువులు ధరలు పెంచడం సిగ్గు చేటన్నారు. రవాణా రంగాన్ని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్న ఆటో కార్మికులు పెరిగిన చమురు ధరలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ.. సీపీఐ వినూత్న నిరసన - పెట్రో ధరలను నిరసిస్తూ సీపీఐ రామకృష్ణ నిరసనలు
పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినూత్న నిరసన చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ఆందోళన చేశారు.

cpi leader ramakrishna protest on petro price
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినూత్న నిరసన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మే నెలలో ఇప్పటివరకు 19 సార్లు పెట్రోల్ ధరలు పెంచాయని చెప్పారు. ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్