నూతన వ్యవసాయ చట్టాలను(agriculture acts) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతులు చేపట్టిన నిరసనలకు పెరుగుతున్న మద్దతు చూసి భాజపా ప్రభుత్వం(BJP government) ఓర్వలేక రైతులపై దాడులు చేయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతుల హత్యలకు కారణమైన కేంద్ర మంత్రి కుమారుడిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను(central minister ajay mishra) బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన రైతు కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా... విజయవాడలో జరిగిన నిరసన(protest) కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
CPI ramakrishna: 'మద్దతును ఓర్వలేక రైతులపై దాడులు' - lakhimpure kheri incident
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ఘటన(lakhimpur kheri incident)ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI leader ramakrishna) ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కారుతో ఢీ కొట్టించి, చంపడం దుర్మార్గమమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు నష్టపరిహారం(exgrasia)తో పాటు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై... జరిగిన హత్యలను ఖండిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులో(gunthakal) సీపీఐ నేతలు(CPI leaders) ఆందోళన చేశారు. ఈ ఘటనకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్(demand) చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను కారుతో ఢీ కొట్టించి చంపడం దుర్మార్గపు చర్య అని విజయనగరం సీపీఐ నాయకులు విమర్శించారు. లఖింపూర్ ఖేరీ ఘటనను ఖండిస్తూ... విజయనగరంలో రాస్తారోకో(rastharoco) చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీచదవండి.