తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారుపై జరిగిన దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఆయన కారుపై జరిగిన దాడిని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలన్నారు. విజయవాడ నగరంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. ఈ దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు.
ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో కూడా వ్యక్తమవుతోందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. కేసులు పెట్టడం, దాడులకు దిగడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలు అత్యధిక మెజార్జీ ఇచ్చినందుకు వారికి మంచి చేయాలని ఆలోచించాలి కానీ... ఈ తరహా దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.