రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడును అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ... విజయవాడలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. వైకాపా పాలనలో మంచివారు జైలుకు, రౌడీలు, గుండాలు అసెంబ్లీకి వెళ్తున్నారని సీపీఐ నేత నారాయణ దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, ఇటువంటి వారిని గెలిపించామా అని బాధపడుతున్నారని కేశినేని నాని మండిపడ్డారు. ఈ ఘటన పర్యవసానాలు కఠినంగా ఉంటాయని ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ హెచ్చరించారు.
వైకాపా పాలనలో మంచివారు జైలుకు, రౌడీలు అసెంబ్లీకి వెళ్తున్నారు: నారాయణ - తెదేపా నేత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అడ్డగింతను సీపీఐ నేత నారాయణ, తెదేపా నేతలు కేశినేని నాని, గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
విజయవాడలో కొవ్వొత్తులతో నిరసన