ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలు.. సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం - చిరంజీవి నారాయణ వార్తలు

ప్రముఖ సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యకమవుతున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని చిరంజీవి అభిమానులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.

సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం
సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం

By

Published : Jul 20, 2022, 7:27 PM IST

ప్రముఖ సినీనటుడు చిరంజీవిపై తిరుపతిలో తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

"నా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతలు కొంత మందికి బాధ.. మరికొంత మందికి ఆవేశం కలిగింది. వారి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అవిలేకుండా రాజకీయాలు ఉండవు. ఆ ప్రకారం నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా పరిగణించాలి. ఆ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలి"- నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

ఏం జరిగిందంటే..:ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడంపై నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిరంజీవి అభిమానులు, జన సైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకతమైంది. ఈ నేపథ్యంలో నారాయణ స్పందిస్తూ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details