కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. విజయవాడలో కొవిడ్ మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించే మహాప్రస్థానం వాహనాన్ని ఆయన ప్రారంభించారు. బాధిత కుటుంబాల ఇబ్బందుల దృష్ట్యా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
కరోనా మృతదేహాలకు అంత్యక్రియాలు నిర్వహించాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శవాలను ఖననం చేసేందుకు శ్మశానాల్లో చోటులభించని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. కొవిడ్ బాధితులకు బీమా సౌకర్యం కల్పించి.. మృతుల కుటుంబాలకు సాయం చేయాలని డిమాండ్ చేశారు.