CPI Protest on Power Cuts : రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త విధానాలే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడ పౌరసరఫరాల కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కట్టెలు, లాంతర్లు, విసనకర్రలతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
కట్టెలు, లాంతర్లు, విసనకర్రలు పట్టుకొని.. రోడ్డెక్కిన సీపీఐ శ్రేణులు - విజయవాడలో సిపిఐ నిరసనలు
CPI Protest on Power Cuts: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త విధానాలే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడ పౌరసరఫరాల కార్యాలయం వద్ద కట్టెలు, లాంతర్లు, విసనకర్రలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
భాజపా, వైకాపా పార్టీ లు వేరైనా.. మోదీ, జగన్ లు మాత్రం ఒక్కటేనంటూ విమర్శించారు. ఇద్దరూ పోటీ పడి మరీ ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. భవన నిర్మాణ పని ముట్ల ధరలు రెట్టింపు చేయడంతో లక్షలాది మంది కార్మికులు పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగష్టు నుంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరో మూడు వేల కోట్లు బాదుడుకు రంగం సిద్ధం చేశారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. ఈనెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :'కాదేది బాదుడుకు అనర్హం' అన్నట్లుంది వైకాపా తీరు: లోకేశ్