ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CP Stephen Ravindra: దేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసాన్ని ఛేదించాం: సీపీ స్టీఫెన్ రవీంద్ర - సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వార్తలు

CP Stephen Ravindra Press Meet: ఎస్బీఐ, ధని లోన్‌బజార్ పేరుతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి.. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను హైదరాబాద్​లోని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్పూఫింగ్ యాప్‌ ద్వారా ఎస్బీఐ అసలైన కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించి.. మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు.

CP Stephen Ravindra
CP Stephen Ravindra

By

Published : Dec 2, 2021, 4:16 PM IST

CP Stephen Ravindra Press Meet: బ్యాంక్​ అధికారులమంటూ అమాయకులకు ఫోన్​ చేసి.. వారి ఖాతాల నుంచి డబ్బును తస్కరిస్తున్న ముఠాను హైదరాబాద్​లోని సైబరాబాద్​ సైబర్​ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్​ను దిల్లీలో గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. అతిపెద్ద సైబర్‌ మోసాన్ని ఛేదించినట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. కాల్​సెంటర్​పై దాడి చేసి రెండు ముఠాలను అరెస్ట్‌ చేసినట్లు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.

సీపీ స్టీఫెన్ రవీంద్ర

దిల్లీలో ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డారు. ఏడాదిలోనే ఈ ముఠా దేశవ్యాప్తంగా 33 వేల ఫోన్లు చేశారు. ఈ కాల్‌సెంటర్ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదయ్యాయి. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాలు సేకరించేవారు. ‌1860 180 1290 అనే నంబరు నుంచి ఫోన్ చేసి.. కార్డుల వివరాలు సేకరించి.. డబ్బులు కొల్లగొట్టేవారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫర్మాన్ హుస్సేన్. స్పూఫింగ్ అప్లికేషన్ల ద్వారా ఖాతాదారుల నగదు లూటీ చేశారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా వందల కోట్లు మోసం చేసి ఉండొచ్చు.

'ధని లోన్‌ బజార్' పేరుతో రుణాలు ఇప్పిస్తామని మరో మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ యాప్ తయారు చేసి ముఠా మోసాలకు పాల్పడుతుంది. రుణం వచ్చిందని చెప్పి అధిక మొత్తంలో రుసుమలు వసూలు చేయడమే ఈ ముఠా లక్ష్యం. ద లోన్ ఇండియా, ధని లోన్ బజార్, పైసా లోన్ హబ్ పేరిట మోసాలకు పాల్పడ్డారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి వివరాలు తీసుకుంటారు. లోన్ వచ్చిందని ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేసేవారు. ఈ కేసులో 14 మందిని అరెస్టు చేశాం. అరెస్టు అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 17 సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నాం.

-సీపీ స్టీఫెన్​ రవీంద్ర

నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకుని... ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని.. ప్రాసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో తీసుకుంటున్నారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. నకిలీ యాప్​ కేసులో అభిషేక్ మిశ్రా ప్రధాన నిందితుడని తెలిపారు. ప్రస్తుతం అభిషేక్ మిశ్రా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details