CP Kanti Rana Tata ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం, ఇతర ఉద్యోగ సంఘలు వివిధ రకాల నిరసన కార్యక్రమాలకు విజయవాడ నగరంలో పిలుపు ఇచ్చారని, ఈ కార్యక్రమాలకు స్థానిక పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతులు లేవని పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. నగరంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని తెలిపారు. విజయవాడ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలను అదునుగా చేసుకుని కొంతమంది అసాంఘిక శక్తులు విజయవాడ పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా, ప్రభుత్వ, రైల్వే ఆస్తులపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం ఉందని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
CP Kanti Rana Tata సీపీఎస్ నిరసన కార్యక్రమాలకు అనుమతులు లేవన్న సీపీ
CP Kanti Rana Tata సీపీఎస్ నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. విజయవాడ నగరంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని స్పష్టం చేశారు.
కాంతి రాణా టాటా