ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్యే దీక్షకు అనుమతి ఇవ్వలేం:విజయవాడ సీపీ - విజయవాడలో చంద్రబాబు దీక్ష వార్తలు

విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి నగర సీపీ ద్వారకా తిరుమలరావును కోరారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన సీపీ.. తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష నేపథ్యంలో అనుమతి ఇవ్వటం కుదరదని చెప్పారు.

cp dwaraka reject YCP mla request for protest at vijayawada

By

Published : Nov 13, 2019, 9:56 PM IST

విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన చేపట్టేందుకు తనకు అనుమతిని ఇవ్వాలంటూ విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కోరారు. ఇప్పటికే ధర్నాచౌక్​లో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకున్నారని సీపీ తెలిపారు. రెండు ప్రధాన పార్టీల నేతలు ఒకే ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు తాము అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఒకే ప్రాంతంలో ధర్నా చేపడితే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని..అందుకే ఎమ్మెల్యే పార్థసారధి చేపడుతున్న నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వివరించారు. వేరే ప్రాంతంలో నిరసన చేపట్టేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేయనున్న దీక్షకు పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details