రాష్ట్రానికి మరో 3.12 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. దిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 26 బాక్సుల్లో టీకాలు తీసుకువచ్చారు. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ను తరలించారు. అక్కడినుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించనుంది.
Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 3.12 లక్షల కొవిడ్ టీకా డోసులు - టీకా డోసులు తాజా వార్తలు
రాష్ట్రానికి మరో 3.12 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకాలను నిల్వ కేంద్రానికి తరలించారు.
![Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 3.12 లక్షల కొవిడ్ టీకా డోసులు COVISHIELD VACCINE DOSES REACHED TO GANNAVARAM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12228921-922-12228921-1624378594203.jpg)
రాష్ట్రానికి చేరుకున్న 3.12 లక్షల కొవిడ్ టీకా డోసులు