ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుటుంబ సభ్యులకు.. కొవిడ్ బాధితుల ఆరోగ్య వివరాలు! - కుటుంబ సభ్యులకు కొవిడ్ బాధితుల ఆరోగ్య వివరాలు న్యూస్

విజయవాడ జీజీహెచ్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య వివరాలు కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలోని ల్యాండ్‌లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.

covid victims Health details to their family members
కుటుంబ సభ్యులకు కొవిడ్ బాధితుల ఆరోగ్య వివరాలు

By

Published : May 4, 2021, 7:38 PM IST

విజయవాడ జీజీహెచ్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య వివరాలు కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారి ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఆసుపత్రిలోని ల్యాండ్‌లైన్‌ నెంబరు 0866-2953132కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

పిన్నమనేని సిద్దార్థ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకునేందుకు త్వరలో ప్రత్యేక సెల్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జీజీహెచ్‌లో కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవలు, మందులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్​తో కొవిడ్ నోడల్ అధికారి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ బాధితులు చివరి నిమిషంలో ఆసుపత్రికి వస్తున్నారని.. వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్య దోరణి చూపుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details