రాష్ట్రానికి మరో 5 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. అక్కడినుంచి టీకా నిల్వ కేంద్రానికి డోసులను అధికారులు తరలించారు.
వ్యాక్సినేషన్‌లో వారికి ప్రాధాన్యం

ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్షించిన సీఎం.. ఉపాధ్యాయులు సహా ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సినేషన్ త్వరగా చేయాలన్నారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకొని వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. అప్పుడే టీకా వృథాను మరింత సమర్థంగా అరికట్టవచ్చన్నారు. 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి
CM Review : వ్యాక్సినేషన్‌లో ఉద్యోగులు, సిబ్బందికి ప్రాధాన్యం