మరో 4 లక్షల కొవిడ్ టీకా డోసులు విజయవాడకు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కొవిషీల్డ్ టీకా డోసులు దిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో రాష్ట్రానికి చేరాయి. వాటిని గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు వాటిని జిల్లాలకు సరఫరా చేయనున్నారు.
రాష్ట్రానికి చేరుకున్న 4 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు - విజయవాడకు చేరుకున్న కొవిషీల్డ్
సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కొవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. వాటిని గన్నవరం కొవిడ్ టీకా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వివిధ జిల్లాలకు సరఫరా చేయనున్నారు.
covishield reached vijayawada