కరోనా ఉద్ధృతి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. జిల్లాల్లోనూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండడం ఆందోళనను మరింత తీవ్రం చేసింది. శుక్రవారం 15,445 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...అందులో 1640మంది మహమ్మారి బారినపడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసుల నమోదుతో.. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 52,466కు పెరిగింది. తాజాగా 1,007 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... వైరస్ బారి నుంచి బయటవారి సంఖ్య 39,327కి చేరింది.
76.8 శాతం మంది ..
మొత్తం కరోనా కేసుల్లో 76.8 శాతం మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరో 8 మంది మృతి చెందగా... ఇప్పటి వరకూ 455 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుత కేసులతో పోలిస్తే మరణాలరేటు ఒక శాతంకంటే తక్కువగా ఉందని వైద్యారోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం 11,675 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్‌లోనే అధికం..
గ్రేటర్ హైదరాబాద్ సహా.. 30 జిల్లాల్లో కొవిడ్ కేసులు బయటపడగా బల్దీయా పరిధిలోనే అత్యధికంగా 683 మందికి వైరస్ సోకింది. రంగారెడ్డి జిల్లాలో 135, సంగారెడ్డిలో 102, కరీంనగర్లో 100, పెద్దపల్లిలో 98, కామారెడ్డిలో 56 కొత్త కేసులు వెలుగు చూశాయి. నాగర్‌కర్నూల్‌లో 52, మహబూబాబాద్‌లో 44, నల్గొండలో 42, వరంగల్ అర్బన్‌లో 36 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 30 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 24 మంది, మెదక్, వరంగల్ రూరల్ జిల్లాల్లో 22మంది చొప్పున మహమ్మారి బారిన పడ్డారు.