కొవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా వివాహాలు, ధార్మిక సభలు సమావేశాల్లో హాజరయ్యే వారి సంఖ్యను నిర్ధరిస్తూ.. వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సమూహ కార్యక్రమాల్లో గరిష్ఠంగా 150 మంది మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. బహిరంగ సమావేశాల్లో మాస్కులు ధరించటం, శానిటైజేషన్ లాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది.
భౌతిక దూరం పాటించేలా సీట్ల మధ్య కనీసం ఐదు అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరైనా ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తే.. విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది.