ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి చేరుకున్న 4.44 లక్షల టీకా డోసులు - medical equipment reached to Vijayawada

రాష్ట్రానికి కేటాయించిన మరో 4.44 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. టీకాలతో పాటు ప్రత్యేక విమానంలో 50 వెంటిలేటర్లు, మరో 50 ప్రాణవాయువు సాంద్రత పరికరాలు చేరుకున్నాయి. ఫలితంగా కొవిడ్ సేవల్లో పురోగతి లభించనుంది.

విజయవాడ చేరుకున్న కొవిడ్ అత్యవసర వైద్య సామగ్రి
విజయవాడ చేరుకున్న కొవిడ్ అత్యవసర వైద్య సామగ్రి

By

Published : May 22, 2021, 10:51 PM IST

Updated : May 23, 2021, 6:24 AM IST

రాష్ట్రానికి కేటాయించిన మరో 4.44 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. మెుత్తం 37 బాక్సుల్లో చేరిన టీకాలను రోడ్డు మార్గంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

చేరుకున్న కొవిడ్ అత్యవసర వైద్య సామగ్రి

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి కొవిడ్ వైద్య సామగ్రి చేరుకుంది. దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ప్రత్యేక విమానంలో 50 వెంటిలేటర్లు, మరో 50 ప్రాణవాయువు సాంద్రత పరికరాలు వచ్చాయి. కరోనా రోగులకు అందించే అత్యవసర చికిత్సలకు వీటిని వినియోగించుకోవాలని సూచించారు. వెంటిలేటర్లతో పాటు చేరుకున్న అత్యవసర వైద్య సామగ్రితో కొవిడ్ సేవల్లో పురోగతి లభించనుంది. ఇప్పటికే ఒకసారి 50 వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను పంపిన కేంద్రం.. తాజాగా అత్యవసర చికిత్సకు మరికొన్ని చేరాయి.

ఇదీ చదవండి…

అనధికారికంగా నిల్వ చేసిన కొవిడ్ వ్యాక్సిన్ల పట్టివేత.. ఒకరు అరెస్ట్

Last Updated : May 23, 2021, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details