రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవనాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు పెట్టేందుకు యోచిస్తున్నామన్నారు. కేంద్రాల గుర్తింపు పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తామని చెప్పారు.
ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం: మంత్రి పెద్దిరెడ్డి - పెద్దిరెడ్డి తాజావార్తలు
కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ కొవిడ్ కేర్ సెంటర్ల బాధ్యత సర్పంచులకు అప్పగిస్తామని తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి
కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ బాధ్యత సర్పంచులే చూసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా కేసుల ఆధారంగా బెడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైరస్ బాధితులకు ఇబ్బంది కలగకుండా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఐసోలేషన్ కేంద్రాలుంటాయని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా