ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలన్నింటిని కోర్టులు తప్పు పడుతున్నాయని ఆక్షేపించారు. చంద్రబాబు హయాంలో విజయవాడలోని ప్రతి పాఠశాలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు మార్చామని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ ఆంగ్ల మాధ్యమానికి వ్యతరేకమని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతుందని విమర్శించారు. లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజల కోసం దీక్ష చేస్తున్న తెదేపా నాయకులను విమర్శించటం తగదని హితవు పలికారు.
'ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుపడుతున్నాయి' - జగన్ పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్
వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు తప్పుపడుతున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్