విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో దంపతులు మృతి - couple died due to current shock
![విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో దంపతులు మృతి 1](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15803675-374-15803675-1657625516284.jpg)
15:59 July 12
భర్తను రక్షించబోయి ఆమె కూడా..
Couple died due to Electrocution: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. భానునగర్‌లో నివసిస్తున్న దంపతులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందారు. మోటార్ వేస్తుండగా భర్త విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతనిని రక్షించబోయి భార్య కూడా విద్యుదాఘాతానికి గురైంది. దాంతో ఇద్దరూ మోటార్ మీద పడి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. దంపతుల మృతితో భానునగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: