విజయవాడలోని అజిత్సింగ్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద రౌడీషీటర్లకు డీసీపీ బాబురావు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర కార్యకలాపాలు మానేసి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
రౌడీషీటర్లు క్షణికావేశంలో చేసిన తప్పును సత్ప్రవర్తనతో సరిదిద్దుకోవాలని మంగళగిరి డీఎస్పీ రాంబాబు అన్నారు. తాడేపల్లి పరిధిలోని సుమారు 70 మంది రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. తాడేపల్లి పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా.. తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తు కోసమైనా మార్పు రావాలని రౌడీషీటర్లకు ఆయన సూచించారు. ఇకపై ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే చర్యలకు కఠినంగా ఉంటాయని తేల్చిచెప్పారు. సత్ప్రవర్తనతో మెలిగే వారిపై రౌడీషీటు తొలగిస్తామని తెలిపారు.