పోలీసు శాఖను కరోనా కలవరపెడుతోంది. కానిస్టేబుల్ నుంచి ఏడీసీపీ స్థాయి అధికారులు వైరస్ బారిన పడుతున్నారు. విజయవాడ సీపీ కార్యాలయంలోనూ తాజాగా ఓ ఉన్నతాధికారికి కొవిడ్ నిర్ధరణ కావడంతో ఆ శాఖలో గుబులు మొదలైంది. పోలీస్ సిబ్బందికి సంబంధించి అన్ని రకాల వ్యవహరాలను పర్యవేక్షించే విభాగంలో పనిచేసే మరో ఉన్నతాధికారికి వైరస్ సోకింది. దీంతో పోలీసుశాఖ మరింత అప్రమతమైంది. వారు నిధులు నిర్వహించే ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు.
ఉద్యోగి భర్తకు పాజిటివ్...
కమిషనరేట్ పరిధిలో సదరు అధికారి దగ్గర పనిచేసే ఓ దిగువస్థాయి సిబ్బంది భర్తకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె పరీక్షలు చేయించుకుని స్వీయనిర్బంధంలో ఉన్నారు. ఆమె నిత్యం సదరు అధికారి దగ్గరకు వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటుంది. ఆమె ద్వారానే వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యాలయంలోని సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.
అప్రమత్తం..