ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పడక దొరికేదాకా పాట్లే! - విజయవాడ తాజా వార్తలు

కరోనాతో వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డకలు లేవని బోర్డులు పెడుతున్నా... ఆసుపత్రి ముందు అంబులెన్స్‌లు వరుస కడుతూనే ఉన్నాయి.

ఆస్పత్రి ముందు క్యూ కట్టిన అంబులెన్స్​లు
ఆస్పత్రి ముందు క్యూ కట్టిన అంబులెన్స్​లు

By

Published : May 6, 2021, 9:54 AM IST

కరోనాతో వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పడకలు లేవని బోర్డులు పెడుతున్నా... ఆసుపత్రి ముందు అంబులెన్స్‌లు వరుస కడుతూనే ఉన్నాయి. పడక దొరుకుతుందనే ఆశతో ఆవరణలోనే చాలామంది పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది రోగులు ఆక్సిజన్‌ పెట్టుకుని అంబులెన్స్‌ల్లోనే నిరీక్షిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వాసుపత్రి కొవిడ్‌ వైద్య విభాగం ముందు పది వరకు అంబులెన్స్‌లు వరుస కట్టాయి.

ఆస్పత్రి ముందు క్యూ కట్టిన అంబులెన్స్​లు

ABOUT THE AUTHOR

...view details