కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. 60 ఏళ్లు పైబడినవాళ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయం అవసరమైన వారినే ఇక్కడికి ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఆసుపత్రిలో 500కు పైగా మంచాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కేసులు ఉద్ధృతంగా నమోదవుతుండటంతో చాలావరకు మంచాలు నిండిపోయాయి. ఆసుపత్రి ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ సహా అన్ని బ్లాక్‌లలోనూ వైద్యమందిస్తున్నారు. నిత్యం భారీ సంఖ్యలో రోగులు వస్తుండగా.. వారిలో అత్యవసర వైద్య సహాయం అవసరమున్నవాళ్లే అధికం. వచ్చే వారందరికీ వెంటనే వైద్యం అందించే పరిస్థితి లేదు. రోగులకు తగ్గట్లుగా వైద్య సిబ్బందీ లేరు. నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే అక్కడ పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది కరోనా బారినపడటంతో వార్డుల్లోకి వెళ్లేందుకే చాలామంది భయపడుతున్నట్లు సమాచారం. బంధువులకు రోగుల ఆరోగ్య సమాచారం ఇచ్చేవారే లేరు. ఆసుపత్రిలో సమాచార కేంద్రం ఏర్పాటు చేసినా.. అక్కడ ఉదయం 11 నుంచి రెండింటి వరకే సమాచారమిస్తున్నారు. దీంతో రోగుల బంధువులకు, సిబ్బందికి వాగ్వాదాలు జరుగుతున్నాయి.
మానసికంగా తీవ్ర ఆందోళన..