ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భార్య ఒడిలోనే ప్రాణం వొదిలిన కరోనా బాధితుడు - AP Corona Latest News

కరోనా వైరస్ ఎన్నో హృదయవిదారక సంఘటనలను, చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. కళ్ల ముందే తండ్రిని, తండ్రి ఎదుటే పిల్లలను బలితీసుకున్న ఉదంతాలు ఎన్నో. తాజాగా విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో ఓ బాధితుడు భార్య ఒడిలోనే కన్నుమూశాడు. ఆమె బాధ మాటల్లో చెప్పలేనిది. అక్షరాల్లో రాయలేనిది.

భార్య ఒడిలోనే ప్రాణం వొదిలిన కరోనా బాధితుడు
భార్య ఒడిలోనే ప్రాణం వొదిలిన కరోనా బాధితుడు

By

Published : May 9, 2021, 8:13 AM IST

విజయవాడ ఆటోనగర్‌కు చెందిన కాటరాజుకు కొవిడ్‌ సోకి వారం రోజులుగా బాధపడుతున్నాడు. శనివారం ఆయాసం ఎక్కువ కావడంతో నగరంలోని కొవిడ్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ రాయించి ఆసుపత్రిలోకి తీసుకెళ్లేలోపు భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. దీంతో భార్య, అతని మిత్రులు బోరున విలపించారు.

ABOUT THE AUTHOR

...view details