ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కోసం 3 లక్షల 87 వేల 983 మంది నమోదు - ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు నమోదైన వైద్యారోగ్య సిబ్బంది జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మొదటి విడతగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది.

corona vaccine distribute district wise
corona vaccine distribute district wise

By

Published : Jan 13, 2021, 3:38 PM IST

రాష్ట్రానికి ఇప్పటికే.. 4 లక్షల 96 వేల కొవిడ్​-19 డోసులు చేరాయి. వాటిని ఆయా జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. జిల్లాల్లో సిద్ధంగా ఉంచిన బల్క్ కూలర్లలో వాటిని నిల్వ చేస్తారు. డోసుల వారీగా జిల్లాలకు వ్యాక్సిన్ పంపిణీని రేపటిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. 16వ తేదీన వ్యాక్సినేషన్ కోసం మొత్తం 3 లక్షల 87 వేల 983 మంది నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

అనంతపురం జిల్లాలో 29,065 మంది, చిత్తూరు-33,773 మంది, తూర్పు గోదావరి-38,128 మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఇక గుంటూరు జిల్లాలో 35,389, కృష్ణా-34,813, కర్నూలు-33,279, ప్రకాశం-25,383, నెల్లూరు-31,346, శ్రీకాకుళం-21,934, విశాఖ-36,694, విజయనగరం-17,465, పశ్చిమగోదావరి-27,323, కడప-27,391 మంది వ్యాక్సినేషన్ జాబితా సిద్ధమైనట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కొక్కరికీ 0.5 ఎంఎల్ డోసు చొప్పున వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలియజేసింది.

ఇదీ చదవండి:చైనా వస్తువులే కాదు టీకా కూడా నాసిరకమే!

ABOUT THE AUTHOR

...view details