పోలీసులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. ఇప్పుడు పోలీసుల వంతు వచ్చింది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కమిషనర్ శ్రీనివాసులతోపాటు కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. పోలీసు సిబ్బంది మొత్తానికి టీకాలు వేయనున్నారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనదని.. ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని కమిషనర్, కలెక్టర్ కోరారు. రెండు పోలీసు యూనిట్లలో మొదటి విడత కార్యక్రమం సుమారు 10 నుంచి 15 రోజుల పాటు సాగనుంది.
విజయవాడలో పోలీసులకు వ్యాక్సినేషన్ ప్రారంభం - పోలీసులకు కరోనా వ్యాక్సిన్
విజయవాడలో పోలీసులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు ప్రారంభించారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనదని.. ప్రతిఒక్కరూ ముందకు వచ్చి టీకా వేయించుకోవాలని వారు సూచించారు.
విజయవాడలో పోలీసులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం