శాసనసభ్యులు, అసెంబ్లీ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఇందు కోసం శాసనసభ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24 నుంచి 26 వరకూ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కొవిడ్ వ్యాక్సినేషన్ వేస్తామని స్పష్టం చేశారు. దీనికోసం వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిబ్బందికి కొవిడ్ టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అసెంబ్లీలో కొవిడ్ టీకా క్యాంపును వినియోగించుకోవాలని సూచించారు.
శాసనసభ్యులు, అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ - శాసనసభ్యులు, అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ వార్తలు
ఈ నెల 24 తేదీ నుంచి రెండు రోజుల పాటు శాసనసభ్యులు, అసెంబ్లీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. దీని కోసం వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.
శాసనసభ్యులు, అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్