తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శనివారం వరకు నిర్వహించిన పరీక్షలలో 46 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. బాధితులలో ఐదు నెలలు, రెండేళ్ల చిన్నారులు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ఆయాకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. మలేరియా సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. వైరస్‌తోనే ఆశా వర్కర్ సర్వే చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా సోకిన వారిలో 31 మంది పురుషులు, 15 మంది మహిళలు ఉన్నారు.
![తెలంగాణ: మల్కాజిగిరిలో 46 మందికి కరోనా నిర్ధరణ corona-update-from-malkajigiri-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7738454-569-7738454-1592913070244.jpg)
corona-update-from-malkajigiri-district