కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరలను రూ.800 నుంచి 475 రూపాయలకుకు తగ్గించారు. ఎన్ఏబీఎల్ ల్యాబుల్లో చేసే కరోనా టెస్టింగ్ ధరలను రూ.1000 నుంచి 499 రూపాయలకు తగ్గించారు. కరోనా టెస్ట్ కిట్ల తయారీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో వాటి ధరలు తగ్గాయని.. దీనివల్లే కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు తగ్గించినట్లు ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తగ్గించిన ధరలను అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు - ఏపీలో కరోనా పరీక్ష ధరలు తగ్గింపు న్యూస్
రాష్ట్రంలో కరోనా పరీక్షల ధరలను రాష్ట్ర ప్రభుత్వం మరింత తగ్గించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
![కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు corona testing rates decreased: ap govt orders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9889224-162-9889224-1608039225840.jpg)
corona testing rates decreased: ap govt orders