ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారీగా నమూనాల సేకరణ...ఫలితం కోసం తప్పని నిరీక్షణ !

కరోనా పరీక్షల ఫలితాల వెల్లడిలో ఆలస్యం... నమూనాలిచ్చిన వారిని క్షణం కూడా కుదురుగా ఉండనీయడం లేదు. ఇళ్లలోనే ఉండాలో? లేక ఆస్పత్రులకు వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. వైద్య పరీక్షల నివేదిక లేనిదే చికిత్స చేయమని ప్రైవేటు ఆస్పత్రులు తెగేసి చెబుతుండటంతో... సాధారణ జబ్బుల వైద్యానికీ నోచుకోవడం కష్టంగా మారింది. ఫలితంగా బాధితుల ఆరోగ్యం మరింతక క్షీణిస్తోంది.

భారీగా నమూనాల సేకరణ...ఫలితం కోసం తప్పని నిరీక్షణ !
భారీగా నమూనాల సేకరణ...ఫలితం కోసం తప్పని నిరీక్షణ !

By

Published : Jul 14, 2020, 3:23 AM IST

Updated : Jul 14, 2020, 3:40 AM IST

రాష్ట్రంలో.. వైద్యపరీక్షల ఫలితాల్లో జాప్యం... నమూనాలిచ్చిన వారికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున అనుమానిత లక్షణాలతో ఉన్న వారు అధిక సంఖ్యలో పరీక్షలను వస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వసతులు లేనందున ఫలితాల వెల్లడిలో ఆలస్యం పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నమూనాల పరీక్షల ఫలితాలకు కనీసం 5 నుంచి వారం రోజుల పడుతోంది. మిగిలిన జిల్లాల్లో 2,3 రోజుల గడువు తీసుకుంటున్నారు.

నమూనాలిచ్చినవారు ఫలితం తెలిసేంతవరకు విడిగా ఉండేందుకు సిద్ధమవడం లేదు. కొందరు చొరవ చూపుతున్నా... ఇళ్లలో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకునేలోగానే... జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కుటుంబీకులూ బాధితులవుతున్నారు. ఇరుగుపొరుగు నుంచి కూడా సమస్యలు వస్తున్నాయి. వైరస్‌ సోకిన వారిలో 80 శాతం మందికి అనుమానిత లక్షణాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో నమూనాలిచ్చిన వారు బయట తిరుగుతున్నందున వ్యాధి విస్తరిస్తోంది. వారిని ఆలస్యంగా ఆస్పత్రులకు తరలిస్తున్నందున అప్పటి వరకు వారితో సన్నిహితంగా మెలిగినవారు తీవ్ర ఆందోళకు గురవుతున్నారు. పరీక్షల కోసం వారూ బారులుతీరున్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన వారి ఫలితం రావడంలోనూ జాప్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నమూనా ఇచ్చిన 24 గంటల్లోనూ ఫలితం రాక... అందించాల్సిన చికిత్సపై వైద్యులు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. వైద్యం అందడంలో ఆలస్యం వల్ల అనేక మంది ఆరోగ్యం విషమిస్తోంది. మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. వీరి అంత్యక్రియల నిర్వహణలోనూ కుటుంబసభ్యులకు సమస్యలు తలెత్తుతున్నాయి.

కరోనా పరీక్షల్లో జాప్యంతో సామాన్యులతో పాటు అధికారులు, ఉద్యోగులు, వైద్య సిబ్బందికీ ఈ తిప్పలు తప్పడం లేదు. వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతున్న దృష్ట్యా... వసతులనూ పెంపొందించాలని అన్నివర్గాల వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి

Last Updated : Jul 14, 2020, 3:40 AM IST

ABOUT THE AUTHOR

...view details