విజయవాడ సింగ్‌నగర్ గంగానమ్మ గుడి ప్రాంతంలో ఓ కుటుంబంలో వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించటంతో అదే కుటుంబానికి చెందిన 12 మందిని అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. కుటుంబ పెద్ద లారీ డ్రైవర్ కావటంతో ఇటీవల ఇతర రాష్ట్రానికి వెళ్లి వచ్చిన తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. బాధితునికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించిన అధికారులు మిగిలిన కుటుంబీకులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
విజయవాడ సింగ్‌నగర్‌లో కరోనా కలకలం - vijawada ajith singnagar
కృష్ణా జిల్లా విజయవాడలోని అజిత్ సింగ్‌నగర్ పరిధిలో ఓ కుటుంబంలోని వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించారు.

విజయవాడ సింగ్‌నగర్‌లో కరోనా కలకలం