ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంత్యక్రియలకు హాజరయ్యారు.. కరోనా బారిన పడ్డారు..

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. మరి వీరు జాగ్రత్తలు తీసుకోలేదా.. అసలు ఏం జరిగింది.

corona-positive-to-19-members-in-single-family-in-sangareddy-district
corona-positive-to-19-members-in-single-family-in-sangareddy-district

By

Published : Jun 13, 2020, 11:53 AM IST

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 9న హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందింది. మృతదేహానికి కరోనా పరీక్ష చేశారు. అదే రోజు రాత్రి మహిళకు అంత్యక్రియలు నిర్వహించగా మరుసటి రోజు సాయంత్రానికి మృతురాలికి పాజిటివ్​గా నిర్ధారణయింది. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు.. మృతురాలి అంత్యక్రియల్లో దగ్గరగా ఉన్న కుటుంబీకులు, బంధువులను గుర్తించి మీర్జాపూర్(బీ) ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. 25 మంది నమూనాలను పరీక్షలకు పంపగా శుక్రవారం రాత్రి 19 మందికి వైరస్​ సోకినట్లు తేలింది.

అంత్యక్రియల్లో పాల్గొన్న నలభై, యాభై మంది

కరోనా సోకిన వారిలో చిన్నారులు, మహిళలు, పురుషులు ఉన్నారు. పాజిటివ్​గా వచ్చిన వారిని సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళ అంత్యక్రియల్లో మరో నలభై, యాభై మంది పాల్గొని ఉంటారని.. వారందరినీ గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు.

జిల్లాలో 24కు చేరిన కేసుల సంఖ్య

శాంతినగర్​లోని ప్రధాన రహదారులు, అంతర్గత దారుల్లో రాకపోకలపై పూర్తిగా నిషేధం విధిస్తూ రెడ్​జోన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. పట్టణంలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు ఉండగా 19 కొత్త కేసులు కలుపుకొని ఆ సంఖ్య 24కు చేరింది. ఒకేసారి కేసుల సంఖ్య 24కు చేరడం వల్ల స్థానికులు భయాందోళనలు నెలకొన్నాయి.

అంత్యక్రియలకు హాజరయ్యారు.. కరోనా బారిన పడ్డారు..

ఇదీ చదవండి:ఈనెల 17న జగన్​, కేసీఆర్​తో ప్రధాని భేటీ

ABOUT THE AUTHOR

...view details