మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్‌లో మంత్రి వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఇటీవల తనను కలిసినవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని హరీశ్‌రావు సూచించారు.

corona-positive-for-minister-harish-rao